📄 ePaper
Epaper 2
Friday, November 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణతపాస్పల్లిలో ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

తపాస్పల్లిలో ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

📰 Generate e-Paper Clip

తపాస్పల్లిలో ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

రైతుల నుంచి అదనపు తూకం వేస్తే సహించేది లేదు

-కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహదేవుని శ్రీనివాస్ హెచ్చరిక

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 11 (ప్రజావాణి): జనగామ నియోజకవర్గం
కొమురవెల్లి మండలంలోని తపాస్పల్లి గ్రామంలో బుధవారం ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహదేవుని శ్రీనివాస్ ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మహదేవుని శ్రీనివాస్ మాట్లాడుతూ, రైతులు ఎంతో కష్టపడి, చెమటోడ్చి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా విక్రయించుకునేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైతు పండించిన ప్రతి గింజకు న్యాయమైన మద్దతు ధర అందాలని, కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి జాప్యం, ఇబ్బందులు ఉండకూడదని స్పష్టం చేశారు.

ముఖ్యంగా ధాన్యం కొనుగోలు సమయంలో నిబంధనలకు విరుద్ధంగా రైతుల నుంచి అదనపు తూకం (కోత) వేయించకూడదని స్పష్టంగా హెచ్చరించారు. రైతుల శ్రమను దోచుకునే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే ఎంతమాత్రం సహించేది లేదని తేల్చి చెప్పారు.

రైతుల నుంచి అదనపు తూకం వేయించినట్లు ఫిర్యాదులు అందినా, తన దృష్టికి వచ్చినా సంబంధిత ఏపీఎం, సీసీ, సీఏలపై తగిన చర్యలు తీసుకునేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని, కొనుగోలు కేంద్రాల నిర్వహణలో పారదర్శకత పాటించాలని, రైతులకు న్యాయం జరిగేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.

కొనుగోలు కేంద్రంలో రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని, తూకంలో పారదర్శకత, సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడాలని అధికారులను కోరారు. రైతులకు ఏదైనా సమస్య వస్తే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, తాను ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ పుట్ట కనకరాజు, ఉప సర్పంచ్ ములుగు నర్సింలు, చేర్యాల ఏఎంసీ డైరెక్టర్ గొల్లపల్లి శ్రీనివాస్, మండల కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు బొచ్చు ఎల్లయ్య యాదవ్, ఎక్స్ ఎంపీటీసీ లింగంపల్లి కనకరాజు, మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ చింతల రమేష్, గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.