📄 ePaper
Epaper 2
Friday, November 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగ్రంథాలయ సంస్థ కార్యాలయంలో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు

గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి (జాతీయ విద్యా దినోత్సవం) వేడుకలను బుధవారం ఖమ్మం జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

ఖమ్మం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ ఖాదర్ బాబా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మహమ్మద్ ఖాదర్ బాబా మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఆజాద్ చేసిన త్యాగాలను, మత సామరస్యం కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఆధునిక భారత విద్యా వ్యవస్థకు ఆయన వేసిన పునాదులు నేటికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. యువత మరియు విద్యార్థులు ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని, ప్రజా గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ కార్యాలయ సిబ్బంది, అధికారులు పాఠకులు పాల్గొని మహనీయుడికి నివాళులర్పించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.