📄 ePaper
Epaper 2
Wednesday, November 11, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకళ్లెం పాల ఉత్పత్తిదారుల సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన విజేతలకు పల్లా అభినందనలు

కళ్లెం పాల ఉత్పత్తిదారుల సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన విజేతలకు పల్లా అభినందనలు

📰 Generate e-Paper Clip

కళ్లెం పాల ఉత్పత్తిదారుల సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన విజేతలకు పల్లా అభినందనలు!

-ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పల్లా రాజేశ్వర్ రెడ్డిని కలిసిన పాల సంఘం విజేతలు

-గ్రామాభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి పూర్తి సహకారం అందిస్తానని భరోసా

-పాల బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరిగితే తన దృష్టికి తీసుకురావాలి – ఎమ్మెల్యే పల్లా

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 11(ప్రజావాణి): జిల్లా లోని
లింగాల ఘనపురం మండలం, కళ్లెం గ్రామంలో ఈ మధ్య కాలం లో జరిగిన పాల ఉత్పత్తిదారుల సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించిన సందర్భంగా విజేతలు జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా విజేతలకు శాలువాలు కప్పి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉంటూ పాల ఉత్పత్తిదారుల సంఘాన్ని సమర్థవంతంగా నడిపించాలని సూచించారు. ఎన్నికల్లో విజయం సాధించిన ఉత్పత్తిదారులందరికీ అభినందనలు తెలిపారు. కళ్లెం గ్రామ ప్రజలకు ఆసుపత్రి, విద్య తదితర సమస్యలు ఏవైనా ఉంటే సర్పంచ్‌తో కలిసి తనను సంప్రదించాలని, వాటి పరిష్కారానికి అవసరమైన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. పార్టీ కార్యాలయమైనా, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయమైనా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు.

ఇటీవల లింగాల ఘనపురం మండలంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో అనేక ఇబ్బందులు ఎదురైనప్పటికీ 21 స్థానాల్లో సుమారు 10 నుంచి 11 స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధించారని పేర్కొన్నారు. సిరిపురం, మణిక్యాపురం పలు గ్రామాల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి ఎదురైందని తెలిపారు. మొత్తంగా మండలంలో పార్టీకి మంచి ప్రజా మద్దతు లభించిందని, భవిష్యత్తులోనూ ప్రజలు పార్టీకి అండగా నిలవాలని కోరారు.

పాల ఉత్పత్తిదారుల సంఘంలో సభ్యులకు డబ్బులు లేదా బిల్లుల చెల్లింపులు ఆలస్యమైతే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అవసరమైతే సంఘం చైర్మన్ లేదా ఎండీతో మాట్లాడి చెల్లింపులు జరిగేలా చూస్తానని, బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇన్‌ఛార్జి , మాజీ మంత్రి డాక్టర్ రాజయ్యతో పాటు తనను ఎప్పుడైనా సంప్రదించవచ్చని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో కళ్లెం పాల సంఘం విజేతలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.