ఎర్రబెల్లి దయాకర్ రావు కి పెళ్లి శుభలేఖ అందజేసిన గుమ్మడవెల్లి సోమన్న
సోమన్న కుమార్తె సౌమ్య వివాహం 13న – భార్గవి గార్డెన్స్ లో ఘనంగా ఏర్పాట్లు
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 11 (ప్రజావాణి): జిల్లా లోని దేవరుప్పుల మండలం, కడవెండి గ్రామానికి చెందిన
ప్రముఖ ఫోటోగ్రాఫర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గుమ్మడవెల్లి సోమన్న తన ఏకైక కుమార్తె చి॥ లా॥ సౌ॥ సౌమ్య వివాహ మహోత్సవానికి మాజీ మంత్రి, పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు ని స్వయంగా కలిసి ఘనంగా ఆహ్వానించారు.
ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం దేవరుప్పుల మండల పర్యటన ఉండగా సోమన్నఈ నెల 13వ తేదీ శుక్రవారం రోజున జరగనున్న తన కుమార్తె వివాహానికి తప్పకుండా విచ్చేయాలని కోరుతూ వివాహ శుభలేఖను అందజేశారు.
ఈ సందర్భంగా గుమ్మడవెల్లి సోమన్న మాట్లాడుతూ, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వద్ద వ్యక్తిగత ఫోటోగ్రాఫర్‌గా ఎంతో కాలం పనిచేసిన అనుబంధం తనకు ఎంతో విలువైనదని, ఆ అనుబంధంతోనే తన కుమార్తె వివాహానికి ఆయన ఆశీస్సులు తప్పకుండా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తన కుమార్తె సౌమ్య వివాహం తన జీవితంలోనే అత్యంత ముఖ్యమైన శుభకార్యమని, ఆ వేడుకకు ఎర్రబెల్లి గారు వస్తే తన కుటుంబానికి ఎంతో సంతోషం కలుగుతుందని పేర్కొన్నారు.
ఆహ్వానాన్ని స్వీకరించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోమన్న దంపతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సోమన్న తన వద్ద ఎంతో నిబద్ధతతో, అంకితభావంతో పనిచేశారని, ఆయన కుమార్తె వివాహం ఘనంగా జరగాలని ఆకాంక్షించారు. వివాహ వేడుకకు తప్పకుండా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
సోమన్న మాట్లాడుతూ సమయం తక్కువగా ఉండటం వల్ల అందరినీ స్వయంగా కలిసి ఆహ్వానించలేకపోతున్నానని, అయినా తన అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అందరూ వివాహానికి విచ్చేసి నూతన దంపతులను ఆశీర్వదించాలని కోరారు.
వివాహ వివరాలు :
తేదీ : 13-11-2026, శుక్రవారం
ముహూర్తం : ఉదయం 10:26 గంటలకు
వేదిక : భార్గవి గార్డెన్స్, కొత్తపల్లి రోడ్, దేవరుప్పుల, జనగామ జిల్లా.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కడవెండి గ్రామ పార్టీ అధ్యక్షుడు తాటిపల్లి మహేష్, ఫాక్స్ వైస్ చైర్మన్ నక్క రమేష్, మండల అధికార ప్రతినిధి సుడిగేల హన్మంతు, మాజీ ఎంపీటీసీ దుబ్బాక రత్నాకర్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు సూలుగురి మహేష్, పార్టీ కార్యకర్తలు, సోమన్న కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

