📄 ePaper
Epaper 2
Tuesday, November 10, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMahabubabadఅఖిలభారత రైతు 36 మహాసభను జయప్రదం చేయండి

అఖిలభారత రైతు 36 మహాసభను జయప్రదం చేయండి

📰 Generate e-Paper Clip

అఖిలభారత రైతు 36 మహాసభను జయప్రదం చేయండి

*నలగొండలో జరిగే భారీ బహిరంగ సభకు వేలాదిగా తరలి రండి*

*తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బొల్లం అశోక్*

తొర్రూర్
నవంబర్ 10(ప్రజావాణి)

అఖిలభారత రైతు 36వ మహాసభను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బొల్లం అశోక్ పిలుపునిచ్చారు.
నవంబర్ 15న అఖిల భారత రైతు సంఘం 36వ మహాసభల నిర్వహణ నల్గొండ జిల్లాలో జరుగుతుందన్నారు. మంగళవారం తొర్రూరు మండల కేంద్రంలో అఖిలభారత రైతు సంఘం 36వ జాతీయ మహాసభల సందర్భంగా, మండల రైతు సంఘం మండల కార్యదర్శి కొత్త వెంకట్ రెడ్డి అధ్యక్షతన మహాసభల కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమం లో ముఖ్యఅతిథిగా అశోక్ పాల్గొని మాట్లాడుతూ, భారతదేశ వ్యవసాయ రంగం తీవ్ర ఆర్థిక సంక్షేమంలో ఉందని రైతులకి గిట్టుబాటు ధర లేదు, దేశంలో రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో పురుగు మందులు ఆకాశాన్ని అంటాయని, ఎరువుల బస్తాలు గత సంవత్సరం కన్నా ఇప్పుడు ఒక బస్తాకు 550 నుంచి 600 రూపాయలు కేంద్ర ప్రభుత్వం రైతు మెడ మీద వేసిందని తెలియజేశారు, భారతదేశంలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా బడా కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పిందని ఆవేదన వ్యక్తం చేశారూ. ఈ విద్యుత్ చట్టాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వారు డిమాండ్ చేశారు. గత రెండు సంవత్సరాల కింద, దేశంలోని అనేక ప్రాంతాల నుంచి రైతులు ఏ ఐ కె ఎస్ అధ్యక్షతన 13 నెలల రైతు ఉద్యమం చేపట్టి దాదాపు 75 మంది రైతులు చనిపోయిన ఉద్యమాన్ని ఆపకుండా నిర్వహించి, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రైతుల మూడు నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవడం జరిగిందని వివరించారు, తక్షణమే కపాస్ కిసాన్ యాప్ ని రద్దు చేయాలని రైతులకు రైతులకు అందుబాటులో యూరియా ఉండే విధంగా చేయాలని వారు కోరారు.అదేవిధంగా రైతుల సాగుకు తాగునీరు అందించి, నిరంతరాయంగా 24 గంటలు కరెంటు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, అదే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రైతుబంధును విడుదల చేయాలని, ఆయన డిమాండ్ చేశారు. పై డిమాండ్లన్నీటిని నలగొండ జిల్లా కేంద్రంలో జరిగే అఖిల భారత రైతు సంఘం 36వ మహాసభలలో చర్చించడానికి నలగొండ జిల్లా కేంద్రం వేదిక కానుంది. మొదటిరోజు నవంబర్ 15న నలగొండ జిల్లా కేంద్రంలో ఎన్ డి కాలేజ్ గ్రౌండ్ లో జరిగే భారీ బహిరంగ సభను లక్షలాదిగా రైతాంగం పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎండి యాకుబ్ , రైతు సంఘం సీనియర్ నాయకులు జన్నపురెడ్డి సోమిరెడ్డి, గడల సాయిలు మారుపెల్లి నాగన్న శ్రీను, దర్గయ్య, బొల్లం మమత షమీనా, భాగ్య ,యాకమ్మ, శ్రీరంగం రాధ, గాలి ముట్టి శోభ, సౌజన్య, ఐలమ్మ చేన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.