వార్డు నంబర్ ఫోరం మండల సోషల్ మీడియా ఇన్‌చార్జిగా దండబోయిన మానస అనిల్ నియామకం
హసన్‌పర్తి, నవంబర్ 10 (మన ప్రజావాణి):
హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం జయగిరి గ్రామానికి చెందిన దండబోయిన మానస అనిల్‌కు వార్డు నంబర్ ఫోరం మండల సోషల్ మీడియా ఇన్‌చార్జిగా కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఆమెను నియమిస్తూ ఫోరం నిర్ణయం తీసుకుంది.
ఈ సందర్భంగా పలువురు ఆమెకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. వార్డు నంబర్ ఫోరం ఆశయాలు, లక్ష్యాలు, చేపడుతున్న కార్యక్రమాలను సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు, ప్రజా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో ఆమె చురుకైన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఫోరం బలోపేతానికి, అభివృద్ధికి కృషి చేయాలని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు.

