గవిచర్ల గ్రామంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి – 9 మంది పట్టివేత
నవంబర్ 9.ప్రజావాణి న్యూస్/ సంగెం
సంగెం పోలీస్ స్టేషన్ పరిధిలోని గవిచర్ల గ్రామంలో డబ్బులు పెట్టి పేకాట ఆడుతున్న 9 మందిని పోలీసులు పట్టుకున్నారు.తేదీ 09-11-2026 మధ్యాహ్నం 1:00 గంట సమయంలో సంగెం పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఎం. వెంకట్ రెడ్డి (HC 2293),కానిస్టేబుళ్లు అమీర్ బాషా (PC 3046),ఎన్. రాజు (PC 4530)తో కలిసి తీగరాజుపల్లి ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, గవిచర్ల గ్రామంలో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది.దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని డబ్బులు పెట్టి మూడు ముక్కల పేకాట ఆడుతున్న 9 మందిని పట్టుకున్నారు.పట్టుబడిన వారి వద్ద నుంచి రూ.1,061 నగదు, 2 మొబైల్ ఫోన్లు, 208 పేకముక్కలను (4 సెట్లు) పంచుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనపై సంగెం పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెం. 242/2026, తెలంగాణ గేమింగ్ చట్టం సెక్షన్ 9(1) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

