📄 ePaper
Epaper 2
Monday, November 9, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఘనంగా శ్రీ ముత్యాలమ్మ తల్లి శోభాయాత్ర

ఘనంగా శ్రీ ముత్యాలమ్మ తల్లి శోభాయాత్ర

📰 Generate e-Paper Clip

ఘనంగా శ్రీ ముత్యాలమ్మ తల్లి శోభాయాత్ర
ప్రజావాణి,నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం గ్రామంలో లోకపావని శ్రీ ముత్యాలమ్మ తల్లికి దీపావళి పురస్కరించుకొని యధావిధిగా ఆదివారం గ్రామంలో పుష్పాలతో అలంకరించిన ప్రత్యేక వాహనం లో జలాభిషేకం కోసం శోభాయాత్ర నిర్వహించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో గ్రామస్తులు అమ్మవారు ఆసీ నులైవున్న వాహనాన్ని పలువురు అత్యంత భక్తి శ్రద్ధలతో భుజాలపై మోశారు. గ్రామస్తులకు, భక్తులకు చిరు మందహాసంతో జగజ్జనని ముత్యాలమ్మ దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారి దివ్య మంగళ కర రూపాన్ని దర్శించుకొని పూజ ద్రవ్యాలు సమర్పించుకొని,భక్తి పారవశ్యంతో పులకించి, తరలించి పోయారు. కార్యక్రమంలో స్థానిక బొల్లి కొండ సర్పంచి చైతన్య నాగరాజు, ఆలయ అర్చకులు కడబోయిన చిన్న శ్రీను గ్రామస్తులు జల్లె రమణయ్య,గిరగాని యాకాంబరం,పాపారావు,పవన్,తుప్పతూరి రాజు యాదవ్,బట్టు రాజశేఖర్,దుస్స యాకయ్య, మహేష్,సురేష్,వెంకన్నతదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.