*సొంతింటిలో పేద కుటుంబాల దీపావళి వెలుగులు!*
*ఇందిరమ్మ ఇళ్లతో నిరుపేదల కల సాకారం.. లాబ్ధి గ్రామంలో లబ్ధిదారుల కుటుంబంతో కలిసి పండుగ జరుపుకున్న కలెక్టర్ భవేష్ మిశ్రా*
నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో, బాసర నవంబర్ 8:– నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. ఆదివారం బాసర మండలం లాబ్ధి గ్రామంలో నిర్వహించిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇల్లు పొందిన తోకలవాడ్ అనూష బాయి–నర్సింగ్ కుటుంబంతో కలిసి వారి నూతన గృహంలో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు పండుగ శుభాకాంక్షలు తెలిపి, పిల్లలకు మిఠాయిలు, టపాసులు, నోటుపుస్తకాలు అందజేశారు. లాబ్ధి గ్రామం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఆదర్శంగా నిలవడం అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడి స్థానిక సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సొంతింటిలో పండుగ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని లబ్ధిదారు అనూష బాయి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శ్రీనివాస్, ఎంపీవో గంగాసింగ్, లబ్ది సర్పంచ్ శంకర్, టాక్లి సర్పంచ్ షెల్కే విష్ణు, దోడపూర్ సర్పంచ్ సతీష్ పటేల్ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


