*షాబాద్ లో దివంగత నేత పట్నం రాజేందర్ రెడ్డి జయంతి వేడుకలు*
*పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, షాబాద్ మాజీ జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి*
షాబాద్ నవంబర్ 08(మన ప్రజావాని )
దివంగత నేత పట్నం రాజేందర్ రెడ్డి జయంతి వేడుకలు షాబాద్ లో నిర్వహించారు. ఆదివారం షాబాద్ మండల కేంద్రంలోని పీఆర్ఆర్ స్టేడియంలో, ముద్డెంగూడ, గొల్లూరుగూడ గ్రామాల్లో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, షాబాద్ మాజీ జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి తదితరులు, పార్టీ శ్రేణులు, అభిమానులు రాజేందర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.


