*చెడుపై మంచి విజయానికి ప్రతీక దీపావళి*
.సెయింట్ మేరీస్ హైస్కూల్ లో ఘనంగా వేడుకలు.
.కరస్పాండెంట్ స్టీఫెన్ రెడ్డి.
.ప్రిన్సిపాల్ వేణు.
ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)
గోవిందరావుపేట మండలం పస్రా సెయింట్ మేరీస్ హైస్కూల్లో దీపావళి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం మొత్తం పండుగ వాతావరణంతో కళకళలాడింది. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొని సందడి చేశారు.
ముందుగా పాఠశాలలో ఏర్పాటు చేసిన దీపాల అలంకరణ, రంగవల్లులు అందరినీ ఆకట్టుకున్నాయి. చిన్నారులు సంప్రదాయ దుస్తుల్లో వచ్చి వేడుకలకు మరింత శోభ తెచ్చారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ స్టీఫెన్ రెడ్డి మాట్లాడుతూ.. దీపావళి పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని అన్నారు. చీకటిని పారద్రోలి వెలుగులు నింపే ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాన్ని, శాంతిని తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా, సురక్షితంగా పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రిన్సిపాల్ వేణు విద్యార్థులకు దీపావళి పండుగ విశిష్టతను వివరించారు. దీపావళి అంటే కేవలం టపాసులు కాల్చడం కాదని, ప్రేమ, ఐక్యత, మానవత్వాన్ని పంచుకోవడమని తెలిపారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని కాలుష్యరహిత దీపావళిని జరుపుకోవాలని సూచించారు. బాణాసంచా వల్ల వచ్చే కాలుష్యం నుంచి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.


