📄 ePaper
Epaper 2
Saturday, November 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డిని కలిసిన పోలీసులు.

ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డిని కలిసిన పోలీసులు.

📰 Generate e-Paper Clip

*ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డిని కలిసిన పోలీసులు…*

*దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపిన పోలీసులు.*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి నవంబర్ 07*

భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డిని క్యాంప్ కార్యాలయంలో పలువురు పోలీస్ అధికారులు శనివారం రోజు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా భువనగిరి డీఎస్పీ రవీందర్ , బీబీ నగర్ సీఐ సూర్యా నాయక్ , భువనగిరి పట్టణ సీఐ వెంకటేశ్వర్లు , భువనగిరి రూరల్ సీఐ చంద్రబాబు , మహిళా పోలీస్ స్టేషన్ సీఐ అర్జునయ్య , రూరల్ ఎస్ఐ అనిల్ లు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని కలిసి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజక వర్గంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోకుండా కఠినంగా వ్యవహరించాలని , శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ పడకుండా, అసాంఘిక కార్య కలాపాలకు పాల్పడే వారి పై కఠిన చర్యలు తీసు కోవాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ , ప్రజలకు భద్రత , నమ్మకం కల్పించేలా పోలీసులు విధులు నిర్వహించాలని ఎమ్మెల్యే సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.