📄 ePaper
Epaper 2
Saturday, November 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకేజీబీవి ఆకస్మిక తనిఖీ.

కేజీబీవి ఆకస్మిక తనిఖీ.

📰 Generate e-Paper Clip

*కేజీబీవి ఆకస్మిక తనిఖీ…*

*రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సమితి సభ్యురాలు సరిత.*

*పాఠశాలలో సౌకర్యాలు, సమస్యలపై ఆరా.*

*జిల్లా బాలల హక్కుల పరిరక్షణ వేదిక ఫిర్యాదు పై స్పందించిన ఎస్పీ సీ ఆర్*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి నవంబర్ 07*

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల /కళాశాలను (మైనారిటీ) రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ సభ్యు రాలు గోగుల సరిత శనివారం రోజు సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బాలికలకు పాఠశాలలో కల్పించిన సౌకర్యాలు , బాలికలు ఎదుర్కొంటున్న సమస్య లను అడిగి తెలుసు కున్నారు. టీచర్ల హాజరు శాతం , వంటల నాణ్యత పై అసంతృప్తిని వ్యక్తం చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా కమిటీ సభ్యులు కొడారి వెంకటేష్ గతంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ కు ఫిర్యాదు చేయడంతో కమీషన్ సభ్యురాలు సరిత పాఠ శాలను సందర్శించినట్లు తెలుస్తోంది. విద్యార్థులు కమీషన్ సభ్యురాలికి లిఖిత పూర్వకంగా సమస్యలను వివరించి నట్లు తెలిసింది. కార్య క్రమంలో పాఠశాల టీచర్ సువర్ణ , బి ఆర్ బి కో- ఆర్డినేటర్ అనంతలక్ష్మి , చైల్డ్ లైన్ కో- ఆర్డినేటర్ దశరథ విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.