📄 ePaper
Epaper 2
Saturday, November 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఎల్కతుర్తి మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం

ఎల్కతుర్తి మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం

📰 Generate e-Paper Clip

ఎల్కతుర్తి మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం

మండల కేంద్రంలో కోర్టు మంజూరు, 56 పోస్టులకు కేబినెట్ ఆమోదం

మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్

ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-

ఎల్కతుర్తి మండల కేంద్రంలో కోర్టు మంజూరుతో పాటు 56 పోస్టులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శనివారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కూడలి వద్ద మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కృతజ్ఞత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుస్నాబాద్ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుకినే సంతాజి సొసైటీ చైర్మన్ ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ గత పాలకుల హయాంలో మండల కేంద్రం అభివృద్ధికి నోచుకోలేదని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే మండల రూపురేఖలు మారుతున్నాయని పేర్కొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో మండలంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేగవంతమవుతున్నాయని తెలిపారు.
మండల కేంద్రంలో కోర్టు మంజూరు చేయడంతో పాటు 56 పోస్టులకు కేబినెట్ ఆమోదం తెలపడం ప్రజలకు ఎంతో మేలు చేసే నిర్ణయమని హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు.
మడిపల్లి,ఎల్కతుర్తి 100 ఫీట్ల రహదారి నిర్మాణం తహసీల్దార్ మరియు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు నూతన హై ఓల్టేజ్ సబ్‌స్టేషన్ల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పిసిసి మాజీ సభ్యులు హుస్నాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ బొమ్మనపల్లి అశోక్ రెడ్డి మాజీ సొసైటీ చైర్మన్ గోలి రాజేశ్వరరావు మాజీ సర్పంచ్ గొడిశాల యాదగిరి గౌడ్ కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరమల్ల రంజిత్ రెడ్డి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అంబాల శ్రీకాంత్ మాజీ యూత్ అధ్యక్షుడు హింగే శ్రీకాంత్ సర్పంచులు రాజు శ్రీకాంత్ రెడ్డి గొలిపెల్లి సంపత్ సొసైటీ ఏఎంసీ డైరెక్టర్లు బండి సుధాకర్ తంగళ్ళపల్లి కొమురయ్య, పుల్లూరి నరసింహారావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ బొల్లెపోగు రమేష్ బాబు, ఠాకూర్ రామ్ సింగ్,గొడిశాల అర్జున్ గౌడ్ గొడిశాల నరేష్ గౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఎర్రోళ్ల చైతన్యకుమార్,మండ సుమన్ గౌడ్ అడ్డూరి సుదర్శన్ ఈర భీమ్ రాజ్ మాజీ సర్పంచ్ రావుల రమేష్ ముష్కి శ్రీనివాస్ కట్కూరి గౌతమ్, కుడుతాడి రమేష్ అల్లగొండ, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.