📄 ePaper
Epaper 2
Sunday, November 8, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఎల్కతుర్తి బస్టాండ్ లో అన్ని ఆర్టీసీ బస్సులు బస్టాండ్ కు రావాలని విజ్ఞప్తి

ఎల్కతుర్తి బస్టాండ్ లో అన్ని ఆర్టీసీ బస్సులు బస్టాండ్ కు రావాలని విజ్ఞప్తి

📰 Generate e-Paper Clip

ఎల్కతుర్తి బస్టాండ్ లో అన్ని ఆర్టీసీ బస్సులు బస్టాండ్ కు రావాలని విజ్ఞప్తి

సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కర్రే లక్ష్మణ్

ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-

ఎల్కతుర్తి మండల కేంద్రము మూడు జిల్లాల సరిహద్దు సిద్దిపేట, కరీంనగర్,హనుమకొండ,వరంగల్ జిల్లాల సరిహద్దు కేంద్రంలో ఉంది. అయితే ఆర్టీసీ బస్సులు మాత్రం కరీంనగర్ డిపో నుండి గాని వరంగల్ గాని బస్సులు సాయంత్రం 6 తర్వాత బస్టాండ్ లోనికి రావడం లేదని దీనివల్ల ప్రయాణికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఒకటి రెండుసార్లు సంబంధిత అధికారులకు ఫోన్ చేసినప్పటికీ బాధ్యతారహితంగా అధికారులు మాట్లాడడం జరుగుతుందని అన్నారు.హనుమకొండ నుండి బయలుదేరే బస్సులు సాయంత్రం ఆరు తర్వాత హాల్టింగ్ లేవని ప్రయాణికులను ఇబ్బంది చేస్తున్నారు హైవే రోడ్డు ద్వారా పోవడం ద్వారా ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది.ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు పోయే బస్సులను యధావిధిగా కొనసాగించాలని నిజామాబాద్ జగిత్యాల అదిలాబాద్,నిర్మల్ బస్సులను రాకుండా హైవే ని గెలిపిస్తున్నారని అధికారులు స్పందించి అట్టి బస్సులను ఎల్కతుర్తి మీదుగా పంపించాలని ఇట్టి విషయంలో ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ బస్సులను నడవడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ సీనియర్ నాయకులు దళిత నాయకులు రేణిగుంట్ల సాంబయ్య,కామెర లక్ష్మణ్,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.