జేవీవీ ఇనుగుర్తి మండల అధ్యక్షులుగా భాస్కర్
ప్రజావాణి,ఇనుగుర్తి: జన విజ్ఞాన వేదిక (జేవీవీ) ఇనుగుర్తి మండల అధ్యక్షుడిగా దార్ల భాస్కర్ నియమితులయ్యారు. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు చిర్ర యాకాంతం గౌడ్ ఒక ప్రకటనలో నూతన కార్యవర్గాన్ని వెల్లడించారు. గౌరవ అధ్యక్షులుగా గంజి వీరేందర్ రెడ్డి, చిన్నాల కట్టయ్య, గౌరవ సలహాదారులుగా వద్దిరాజు వెంకటేశ్వర్లు, కూటికంటి మధు, అమ్మ యాకయ్య, ప్రధాన కార్యదర్శిగా ఆది చందు,కోశాధికారి గాడుదుల గణేష్,ఉపాధ్యక్షులు కుంభం మహేందర్ రెడ్డి, ఎలమద్రి ప్రభాకర్,మల్లం అజయ్, ఎం. ప్రవీణ్ కుమార్, చెకుముకి కన్వీనర్ గా వేముల శ్రీనివాస్, సమతా కన్వీనర్ పొన్నం కవిత, హెల్త్ కన్వీనర్ బూర రజినీకాంత్, సహాయ కార్యదర్శి బానోత్ మోహన్ నాయక్,మీడియా కన్వీనర్ గుండ్రపల్లి రవీందర్ లను నియమించినట్లు తెలిపారు. సమాజంలో సైన్సు పట్ల అవగాహన పెంపొందించేందుకు నూతన కార్యవర్గం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు దార్ల భాస్కర్ మాట్లాడుతూ తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జిల్లా, రాష్ట్ర కమిటీ బాధ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల్లో శాస్త్రీయ ఆలోచనలు రేకెత్తించేందుకు, సమాజంలో మూఢనమ్మకాలను నిర్మూలించేందుకు సమిష్టిగా కృషి చేస్తామని, సైన్స్ పరిజ్ఞానంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు.

