📄 ePaper
Epaper 2
Sunday, November 8, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్మెడిసిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో సెయింట్ క్లారెట్ హైస్కూల్‌లో ఉచిత మెగా వైద్య శిబిరం

మెడిసిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో సెయింట్ క్లారెట్ హైస్కూల్‌లో ఉచిత మెగా వైద్య శిబిరం

📰 Generate e-Paper Clip

మేడ్చల్ (ప్రజావాణి):- మెడిసిటీ హాస్పిటల్, మేడ్చల్ ఆధ్వర్యంలో శనివారం మేడ్చల్‌లోని సెయింట్ క్లారెట్ హైస్కూల్‌లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ జోషాప్ శాందప్ప ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వైద్య శిబిరానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విశేషంగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వైద్య బృందం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు బీపీ, షుగర్ పరీక్షలతో పాటు కంటి పరీక్షలు నిర్వహించారు. అలాగే చెవి, ముక్కు, గొంతు సంబంధిత సమస్యలు, థైరాయిడ్ గడ్డలు, చర్మ సమస్యలపై వైద్య పరీక్షలు నిర్వహించారు. చిన్నారులకు పిల్లల వైద్య నిపుణులు పరీక్షలు చేసి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. వైద్య శిబిరంలో సుమారు 500 మందికి షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించారు. తదుపరి పరీక్షలు లేదా ఆపరేషన్లు అవసరమైన 32 మందిని మెడిసిటీ హాస్పిటల్‌కు రిఫర్ చేశారు. వీరికి ఆసుపత్రిలో అవసరమైన పరీక్షలు, ఆపరేషన్లు ఉచితంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. వైద్య బృందంలో డాక్టర్లు కీర్తి, అలేఖ్య, ప్రత్యూష, సాహిత్య, శ్రావ్య, మనస్విని, శ్వేత, రాహుల్, విశాల్ పాల్గొన్నారు. అలాగే మార్కెటింగ్ మేనేజర్ కుమారస్వామి, టీం లీడర్ సత్యనారాయణ, రాజు, నవీన్ కుమార్, కవిత, గంగోత్రి తదితరులు పాల్గొని వైద్య శిబిరాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.