ఇరుగు పొరుగు ఇళ్ల మధ్య గొడవ.. వ్యక్తిపై బైండోవర్ కేసు
శాంతిభద్రతల పరిరక్షణకు ముందస్తు చర్యలు
బెజ్జంకి, నవంబర్ 5 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని డబుల్ బెడ్‌రూమ్ కేసీఆర్ కాలనీలో ఇరుగు పొరుగు ఇళ్ల మధ్య జరిగిన గొడవ నేపథ్యంలో అల్లకుంట సుధాకర్ (42)పై బైండోవర్ చర్యలు చేపట్టినట్లు తహసీల్దార్ కల్యాణపు శ్రీకాంత్ తెలిపారు.శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

