*ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్పంచులకు అవకాశం కల్పించాలి*
నాగర్ కర్నూల్ జిల్లా…
కల్వకుర్తి నియోజకవర్గం:
నవంబర్ 05 /ప్రజావాణి ప్రతినిధి..
వెల్దండ, నవంబర్ 05: ఎంపీటీసీల తరహాలోనే సర్పంచులకు కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని బొల్లంపల్లి గ్రామ సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్ గురువారం మండల కేంద్రంలో మాట్లాడారు.స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్పంచులకు ఓటు హక్కు, ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన స్పష్టం చేశారు.ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు ఎన్నికలో భాగస్వాములవుతున్నప్పుడు గ్రామ ప్రథమ పౌరులైన సర్పంచులను దూరం పెట్టడం సరికాదన్నారు.గ్రామంలో రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, పాఠశాలలు, సంక్షేమ పథకాల అమలు ఇలా ప్రతి అంశంలోనూ సర్పంచులు నేరుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ కృషి చేస్తున్నారని తెలిపారు.ఎండైనా, వానైనా ప్రజల కోసం శ్రమిస్తున్న సర్పంచులను గుర్తించి, వారికి అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.

