📄 ePaper
Epaper 2
Thursday, November 5, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణరేగులపల్లిలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన

రేగులపల్లిలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన

📰 Generate e-Paper Clip

రేగులపల్లిలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన

బ్యాంకింగ్ సేవలు, బీమా పథకాలపై గ్రామస్తులకు అవగాహన

బెజ్జంకి, నవంబర్ 5 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని రేగులపల్లి గ్రామంలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బెజ్జంకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌డీఓ శివానంద్, ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్ సతీష్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు బ్యాంకింగ్ సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆధార్ సీడింగ్, కేవైసీ నవీకరణ, నామినేషన్ ప్రక్రియపై వివరించారు. అలాగే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పథకాల ప్రయోజనాలను గ్రామస్తులకు తెలియజేశారు.ప్రతి ఒక్కరూ తమ బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేసుకుని, కేవైసీ వివరాలను సకాలంలో నవీకరించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ జంగిలి లక్ష్మి తిరుపతి, కార్యదర్శి తిరుపతి, బీసీ మురళి, నాగలక్ష్మి, సుష్మ, బ్యాంకు ఖాతాదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.