📄 ePaper
Epaper 2
Thursday, November 5, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణబెజ్జంకి మండలంలో ఎలుగుబంటి సంచారం కలకలం

బెజ్జంకి మండలంలో ఎలుగుబంటి సంచారం కలకలం

📰 Generate e-Paper Clip

బెజ్జంకి మండలంలో ఎలుగుబంటి సంచారం కలకలం

బెజ్జంకి, నవంబర్ 5 (ప్రజావాణి)

బెజ్జంకి మండలంలోని తలారివానిపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లో ఎలుగుబంటి సంచారం స్థానికుల్లో భయాందోళన కలిగిస్తోంది. ఇటీవల గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల్లో ఎలుగుబంటి కనిపించినట్లు స్థానికులు తెలిపారు.గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో పొలాలకు వెళ్లే రైతులు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ఎలుగుబంటి సంచారంతో ప్రజలు ఒంటరిగా పొలాలకు వెళ్లేందుకుభయపడుతున్నారు.గ్రామ ప్రజల భద్రత దృష్ట్యా అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేసినట్లు తలారివానిపల్లి సర్పంచ్ గండికోట సురేష్ తెలిపారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఎలుగుబంటి సంచారంపై తగిన చర్యలు తీసుకుని గ్రామస్తులకు భరోసా కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.