📄 ePaper
Epaper 2
Thursday, November 5, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఅమిత్ షాకు జగ్గారెడ్డి ఘాటు కౌంటర్

అమిత్ షాకు జగ్గారెడ్డి ఘాటు కౌంటర్

📰 Generate e-Paper Clip

అమిత్ షాకు జగ్గారెడ్డి ఘాటు కౌంటర్

• రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తెలంగాణ కాంగ్రెస్ లక్ష్యం 17 ఎంపీ స్థానాల్లో 14 గెలిచి చూపిస్తాం శ్రీరాముడి పేరుతో అధికారంలోకి వచ్చారు.. ఆయన అడుగుజాడల్లో నడవడం లేదు

మన ప్రజావాణి | నవంబర్ 05 | హైదరాబాద్ జిల్లా ప్రతినిధి

రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేరంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒక సవాల్‌గా తీసుకుంటుందని, రానున్న ఎన్నికల్లో తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు గాను 14 స్థానాలను గెలుచుకునేందుకు కృషి చేస్తామని ప్రకటించారు.

ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారో లేదో తనకు తెలియదని, కానీ ప్రధానమంత్రి పదవే రాహుల్ గాంధీ కుటుంబంలో పుట్టిందని వ్యాఖ్యానించారు. 2004లో యూపీఏ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ప్రధానమంత్రిగా చేయాలని ఎంపీలు కోరినా వారు ఆ పదవిని స్వీకరించకుండా డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు అవకాశం కల్పించారని గుర్తుచేశారు.

మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా రాహుల్ గాంధీని ప్రధాని కావాలని కోరినప్పటికీ, ఆయన తిరస్కరించారని తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా దేశంలోని కోట్లాది మంది పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలిచిందని పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలా వద్దా అనేది దేశ ప్రజలు, ఓటర్లు నిర్ణయిస్తారని, ఆ హక్కును శాసించే అధికారం అమిత్ షాకు లేదని అన్నారు. అమిత్ షా అహంకారపూరిత వ్యాఖ్యలకు తెలంగాణ కాంగ్రెస్ తగిన సమాధానం చెబుతుందని స్పష్టం చేశారు.

శ్రీరాముడి పేరుతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, అయితే శ్రీరాముడి ఆదర్శాలకు అనుగుణంగా పాలన సాగించడం లేదని విమర్శించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే శ్రీరాముడి పేరును ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు.

స్వాతంత్ర్య ఉద్యమ సమయంలోనే మహాత్మా గాంధీ ‘రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం’ అంటూ భజనలు చేశారని గుర్తుచేశారు. ఆ సమయంలో బీజేపీ పార్టీనే పుట్టలేదని, మోదీ, అమిత్ షాలు కూడా రాజకీయాల్లోకి రాలేదని వ్యాఖ్యానించారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుతో బీజేపీ రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని, పటేల్ నెహ్రూ మంత్రివర్గంలో పనిచేసిన కాంగ్రెస్ నాయకుడని గుర్తుచేశారు. నెహ్రూ నాయకత్వంలోనే హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసే ప్రక్రియ జరిగిందని పేర్కొన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బలమైన ప్రజాదరణ ఉందని, రానున్న ఎన్నికల్లో 17 ఎంపీ స్థానాలకు గాను 14 స్థానాలను గెలుచుకుని రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే దిశగా పనిచేస్తామని జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.