రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ బ్యాడ్మింటన్ పోటీలకు రెబ్బనపల్లి విద్యార్థి ఎంపిక
మంచిర్యాల జిల్లా తరఫున ప్రతిభ చాటిన జె. రాంచరణ్
దండేపల్లి, నవంబర్ 4 (ప్రజావాణి):
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రెబ్బనపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన ఏడో తరగతి విద్యార్థి జె. రాంచరణ్ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) అండర్-14 బాలుర బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికయ్యాడు.
గత నెలలో మంచిర్యాల హైటెక్ సిటీ క్లబ్లో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి అండర్-14 బాలుర బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌తో పాటు ఎంపిక పోటీల్లో రాంచరణ్ మంచిర్యాల జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. దీంతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరగనున్న రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్-14 బాలబాలికల బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో రాంచరణ్ పాల్గొననున్నట్లు పాఠశాల వ్యాయామ విద్య ఉపాధ్యాయుడు (పీడీ) గాజుల శ్రీనివాస్ తెలిపారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఇన్చార్జి మండల విద్యాధికారి మంత్రి రాజు, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు రూపాచారి, ఉపాధ్యాయ బృందం, జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి ఎం.డి. యాకూబ్, వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బండి రవి, సూర సుదర్శన్, సీనియర్ పీడీలు రామ్మోహన్రావు, సిరంగి గోపాల్, రెబ్బనపల్లి గ్రామ సర్పంచ్ కందుల కళ్యాణి అశోక్, ఉపసర్పంచ్ వినోద్‌తో పాటు గ్రామ పెద్దలు విద్యార్థి రాంచరణ్‌ను అభినందించారు.

