📄 ePaper
Epaper 2
Wednesday, November 4, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపేదల బియ్యంలో కోత పెడితే కఠిన చర్యలే.. రేషన్ షాపుల్లో సర్పంచ్ బిల్లా యాదగిరి ఆకస్మిక...

పేదల బియ్యంలో కోత పెడితే కఠిన చర్యలే.. రేషన్ షాపుల్లో సర్పంచ్ బిల్లా యాదగిరి ఆకస్మిక తనిఖీలు

📰 Generate e-Paper Clip

**పేదల బియ్యంలో కోత పెడితే కఠిన చర్యలే.. రేషన్ షాపుల్లో సర్పంచ్ బిల్లా యాదగిరి ఆకస్మిక తనిఖీలు!**

హనుమకొండ జిల్లా | వేలేరు:

ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న రేషన్ బియ్యం పంపిణీలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా చూడాలనే లక్ష్యంతో వేలేరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని రేషన్ డీలర్ షాపులను గ్రామ సర్పంచ్ బిల్లా యాదగిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా వేలేరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో మొత్తం నాలుగు రేషన్ షాపులు ఉండగా, వాటి ద్వారా సుమారు 2,250 రేషన్ కార్డులకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం సరఫరా, పంపిణీ తీరును పరిశీలించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ బిల్లా యాదగిరి మాట్లాడుతూ…

ప్రభుత్వం పేద ప్రజల కోసం అందిస్తున్న సన్న బియ్యం ప్రతి అర్హుడైన రేషన్ కార్డుదారుడికి పూర్తి స్థాయిలో అందాలని స్పష్టం చేశారు. తరుగు పేరుతో బియ్యంలో కోత విధించడం, తూకంలో తేడాలు చూపించడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు.

రేషన్ షాపులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తూనికలు, కొలతల్లో పారదర్శకత పాటించాలని, ప్రతి కార్డుదారుడికి నిర్ణీత పరిమాణంలో బియ్యం అందేలా రేషన్ డీలర్లు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

బియ్యం పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరిగినా, తూకాల్లో తేడాలు గుర్తించినా సంబంధిత డీలర్లపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు.

పేదలకు అందాల్సిన ప్రభుత్వ రేషన్ బియ్యం ప్రతి గింజా అర్హులైన లబ్ధిదారులకు చేరాలి.. ప్రజల హక్కులకు భంగం కలగకుండా రేషన్ పంపిణీ పారదర్శకంగా జరగాలి అనే లక్ష్యంతో ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి విజయ, వార్డు సభ్యులు లక్ష్మీనారాయణ, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.