📄 ePaper
Epaper 2
Wednesday, November 4, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపట్టభద్రుల ఇంటింటికీ వెళ్లి ఓటరు నమోదును పరిశీలించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి

పట్టభద్రుల ఇంటింటికీ వెళ్లి ఓటరు నమోదును పరిశీలించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి

📰 Generate e-Paper Clip

పట్టభద్రుల ఇంటింటికీ వెళ్లి ఓటరు నమోదును పరిశీలించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి

జనగామ జిల్లా ప్రతినిధి జె. ఉపేందర్, నవంబర్ 04 (ప్రజావాణి): రాబోయే ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మాజీ మంత్రి, పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు గురువారం తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలో పర్యటించారు.

ఈ సందర్భంగా ఆయన పలువురు పట్టభద్రుల ఇళ్లకు స్వయంగా వెళ్లి వారి వివరాలను సేకరించారు. అనంతరం గ్రామ సర్పంచ్ సునీత వీరారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆన్‌లైన్ ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించి, నమోదు ప్రక్రియను పరిశీలించారు. పట్టభద్రులతో ఓటరు నమోదు చేయించారు.

ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా తన ఓటును నమోదు చేసుకోవాలని సూచించారు. పట్టభద్రుల ఓటు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే శక్తివంతమైన ఆయుధమని, విద్యావంతులైన యువత ఆలోచించి ఓటు వేసినప్పుడే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి, నిరుద్యోగ యువతతో పాటు పట్టభద్రులను మోసం చేస్తోందని విమర్శించారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేలా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని పట్టభద్రులను కోరారు.

అమ్మాపురం గ్రామంలోని ప్రతి పట్టభద్రుడిని కలిసి ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలని, ఒక్క ఓటు కూడా నమోదు కాకుండా మిగిలిపోకుండా చూడాలని సర్పంచ్ సునీత వీరారెడ్డితో పాటు స్థానిక నాయకులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో పట్టభద్రులు బొమ్మేరా భాషా, గట్టు నవీన్, కోటగిరి కృష్ణమూర్తి, పస్రం శ్రీను, గంధం అశోక్, వడ్లకొండ మమతతో పాటు గ్రామ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.