📄 ePaper
Epaper 2
Wednesday, November 4, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణలక్ష్మణ్ గౌడ్ మృతికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి

లక్ష్మణ్ గౌడ్ మృతికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి

📰 Generate e-Paper Clip

లక్ష్మణ్ గౌడ్ మృతికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి!

-పొంగులేటి ఉద్యమకారుల త్యాగాల గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది!

-సాగునీరు, విద్యుత్ అందక పంట ఎండిపోవడంతో ఆర్థిక ఇబ్బం దులు, మనోవేదనకు గురై రైతు మృతి

-కలెక్టర్ వేధింపులు, భూభారతి పేరుతో రైతు కుటుంబాన్ని అవమానించడం దారుణం

-రైతు మృతికి బాధ్యులైన కలెక్టర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలి

-బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి

-ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకోవడంలో కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు

-కేసీఆర్, ఆయన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు

-జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 04 (ప్రజావాణి):
లక్ష్మణ్ గౌడ్ మృతికి కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గురువారం ఒక ప్రకటన లో డిమాండ్ చేశారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన లక్ష్మణ్ గౌడ్ అనే రైతు తనకు చెందిన నాలుగు ఎకరాలతో పాటు మరో ఆరు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. సరైన సాగునీరు అందకపోవడంతో పంట ఎండిపోయిందని, విద్యుత్ సరఫరా కూడా సక్రమంగా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంట చేతికి రాకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, తీవ్ర మనోవేదనతో ఆ రైతు మృతి చెందడం బాధాకరం అన్నారు. రైతు మృతికి ప్రభుత్వం బాధ్యత వహించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

సదరు రైతుకు ఉన్న చిన్నపాటి సైడ్ వ్యాపారమైన జేసీబీ విషయంలో కూడా కలెక్టర్ కేసులు నమోదు చేసి, చివరికి దాన్ని అమ్ముకునే విధంగా వేధించారని. జనగామ జిల్లాలో భవన నిర్మాణాలకు సంబంధించిన చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటున్న అనేక మంది దగ్గర నుంచి కోట్ల రూపాయలు వసూలు చేయడం దారుణం అన్నారు. వారి వాహనాలు సీజ్ కావడం, ఆర్థికంగా ఇబ్బందులు పడటం, చివరికి వ్యాపారాలు మానుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, చివరికి ప్రాణాలు తీసుకునే పరిస్థితులకు కలెక్టర్ తీరు కారణమవుతోందని, చిరు వ్యాపారుల దగ్గర కోట్ల రూపాయ లు వసూలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. లక్ష్మణ్ గౌడ్ జేసీబీని అమ్ముకోవడం, తద్వారా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం వెనుక కూడా కలెక్టర్ వేధింపులే కారణం అన్నారు.
వందల ఏళ్లుగా ఆ కుటుంబానికి ఉన్న భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేయకుండా, భూభారతి పేరుతో ఇబ్బందులకు గురిచేస్తూ కుటుంబాన్ని అవమానించారని, రైతు కుటుంబానికి న్యాయం చేయాల్సిన కలెక్టర్ వారిని మరింత మానసిక క్షోభకు గురిచేయడం దారుణం మని, ఈ ఘటనకు బాధ్యులు జిల్లా కలెక్టర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదే సమయంలో తెలంగాణ ఉద్యమం, ఉద్యమకారుల త్యాగాల గురించి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడటం దయ్యా లు వేదాలు వల్లించినట్లుగా ఉందని, అసలు తెలంగాణ అనే పదాన్నే వ్యతిరేకించిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి పచ్చి వ్యతిరేకిగా ఉన్న వ్యక్తి నేడు ఉద్యమకారుల త్యాగాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని, ఆయన ఎవరి మద్దతుతో, ఏ డబ్బులతో గెలిచారో ప్రజలందరికీ తెలుసునని, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో అత్యంత ఎక్కువ భూమిని నేడు అక్రమంగా సంపాదించుకుని దేశంలోనే అత్యంత పెద్ద భూ బకాసురుడిగా ఉన్న పొంగులేటి, కేసీఆర్‌పై వ్యాఖ్యలు చేయడం సూర్యుడిపై ఉమ్మివేసిన చందంగా ఉందని, ఉద్యమకారుల కుటుంబా లపై నిజంగా ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే మొసలి కన్నీరు కార్చడం మాను కుని ఆ కుటుంబాలను ఆదుకోవాలన్నారు.

తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబా లకు గతంలో కేసీఆర్ ప్రభుత్వం అందించిన విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉద్యోగాలు, ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. అవసరమైన చోట ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, ఉద్యమ కారుల త్యాగాల గురించి మాట్లాడే ముందు వారి కుటుంబాలకు ఏం చేస్తున్నారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. అలాగే కేసీఆర్‌పై, కేసీఆర్ కుటుంబంపై నీచమైన, అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని పల్లా రాజేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన పోరాటం, ఉద్యమకారుల త్యాగాలను తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నాలను ప్రజలు సహించరని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.