📄 ePaper
Epaper 2
Tuesday, November 3, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణదివ్యాంగ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపే క్రీడోత్సవాలు

దివ్యాంగ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపే క్రీడోత్సవాలు

📰 Generate e-Paper Clip

*దివ్యాంగ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపే క్రీడోత్సవాలు*

*మంచాల భవిత కేంద్రంలో ఘనంగా దివ్యాంగుల క్రీడా పోటీలు*

*విజేతలకు బహుమతుల ప్రదానం*

రంగారెడ్డి జిల్లా మంచాల, నవంబర్ 3 (ప్రజావాణి): మంచాల మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో దివ్యాంగ విద్యార్థుల కోసం క్రీడోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగ విద్యార్థినీ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని వివిధ క్రీడా పోటీల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. ఆటల పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేసి అభినందించారు.

దివ్యాంగ విద్యార్థులకు క్రీడోత్సవాలు నిర్వహించడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం, ధైర్యం, పట్టుదల పెంపొందుతాయి. క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుంది. ఇతర విద్యార్థులతో కలిసిమెలిసి ఉండటం, స్నేహభావం, సహకార స్ఫూర్తి, గెలుపోటములను సమానంగా స్వీకరించే మనస్తత్వం అలవడుతుంది. తమలోనూ ప్రత్యేక ప్రతిభ ఉందనే భావనతో విద్యార్థులు ముందుకు సాగేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయి. దివ్యాంగులలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసి, వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహించేందుకు క్రీడోత్సవాలు ఎంతగానో ఉపయోగపడతాయి.

ఈ కార్యక్రమానికి మంచాల మండల విద్యాధికారి రాందాస్, ఎంపీపీఎస్ మంచాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు సాయికుమార్, ప్రత్యేక విద్యా ఉపాధ్యాయులు శివకుమార్, ఐఈఆర్‌పీ సత్యనారాయణ, యాదయ్య, సీఆర్‌పీ గిరీష్, ఆర్‌పీ యాదయ్యతో పాటు పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. విద్యార్థులను ప్రోత్సహించి క్రీడోత్సవాలను విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.