📄 ePaper
Epaper 2
Tuesday, November 3, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఉద్యాన పంటలే శరణ్యం

ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఉద్యాన పంటలే శరణ్యం

📰 Generate e-Paper Clip

*ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఉద్యాన పంటలే శరణ్యం*

—-యువ రైతుల ఆత్మీయ కలయికలో డీహెచ్వో లత

*రాయికల్, నవంబర్ 03 (ప్రజావాణి):*

రాయికల్ మండలంలోని ఆలూర్-వీరాపూర్ గ్రామాల మధ్యలో నల్లగుట్టపై స్వయంభుగా వెలిసిన పురాతన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఆవరణంలో జగిత్యాల జిల్లా స్థాయి యువ రైతుల ఆత్మీయ కలయిక సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్, కోరుట్ల, సారంగాపూర్, రాయికల్ తదితర మండలాలకు చెందిన యువ రైతులు, మహిళా రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా ఉద్యానవన అధికారి (డిహెచ్ఓ) లత మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఎల్ నినో ప్రభావంతో సాగునీటి లభ్యత తగ్గే అవకాశం ఉందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ నేపథ్యంలో నీటి అవసరం తక్కువగా ఉండి, నిత్య ఆదాయాన్ని ఇచ్చే ఉద్యానవన పంటల వైపు యువత దృష్టి సారించాలని సూచించారు. వ్యవసాయంపై మక్కువ పెంచుకుని, ఆధునిక సాంకేతికతను జోడించి సాగు చేస్తే మంచి లాభాలు పొందవచ్చని అన్నారు. యువకులు చేస్తున్న కృషి జిల్లాకే ఆదర్శమని, ముఖ్యంగా మహిళా రైతులు వ్యవసాయంలో చూపుతున్న చొరవ అభినందనీయమని కొనియాడారు.జిల్లా వ్యవసాయ అధికారి (డిఏవో) భాస్కర్ మాట్లాడుతూ యువత వ్యవసాయం వైపు మళ్లడం హర్షణీయమన్నారు. పశుగ్రాసం కొరతను అధిగమించేందుకు కమ్యూనిటీ భూముల్లో ఫాడర్ కల్టివేషన్ (పశుగ్రాస సాగు) వంటి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, దీనికి సంబంధించి 0.4 హెక్టార్లకు రూ.14,567 ఎస్టిమేట్ తో ప్రభుత్వం సహకారం అందిస్తుందని తెలిపారు.అనంతరం జాతీయ ఉత్తమ మహిళా రైతు అవార్డు గ్రహీత బండారి విజయ వెంకటేష్ ను మల్లాపూర్ మండలం ముత్యంపేట, కోరుట్ల మండలం ధర్మారం, సారంగాపూర్ మండలం పెంబట్ల, లక్ష్మీదేవిపల్లి, ఆలూర్ రైతులు సంయుక్తంగా ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో నాబార్డ్ డీడీఎం దిలీప్, శాస్త్రవేత్త తిరుపతి, ఏవో ముక్తేశ్వర్, హెచ్ఈవో అన్వేష్, ఫ్రెండ్స్ ఫరెవర్ మిత్రబృందం, మాజీ సర్పంచ్ మెక్కొండ రాంరెడ్డి, రాజు, తిరుపతి, శేఖర్, ఆదిరెడ్డి, మల్లారెడ్డి, గంగారెడ్డి, సతీష్, మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.