ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఉద్యాన పంటలే శరణ్యం

*ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఉద్యాన పంటలే శరణ్యం* ----యువ రైతుల ఆత్మీయ కలయికలో డీహెచ్వో లత *రాయికల్, నవంబర్ 03 (ప్రజావాణి):* రాయికల్ మండలంలోని ఆలూర్-వీరాపూర్ గ్రామాల మధ్యలో నల్లగుట్టపై స్వయంభుగా వెలిసిన పురాతన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఆవరణంలో జగిత్యాల జిల్లా స్థాయి యువ రైతుల ఆత్మీయ కలయిక సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్, కోరుట్ల, సారంగాపూర్, రాయికల్ తదితర మండలాలకు చెందిన యువ రైతులు, మహిళా రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా ఉద్యానవన అధికారి (డిహెచ్ఓ)...