📄 ePaper
Epaper 2
Thursday, November 5, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగంజాయి కేసు పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్

గంజాయి కేసు పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్

📰 Generate e-Paper Clip

గంజాయి కేసు పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్
సీఐ వై.సత్యనారాయణ
ప్రజావాణి,నెల్లికుదురు: అక్రమ రవాణా కేసులో పరారీలో ఉన్న నిందితుని అరెస్టు చేసినట్లు కేసముద్రం సీఐ వై.సత్యనారాయణ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం సర్కిల్ కార్యాలయంలో నెల్లికుదురు ఎస్సై గంగారపు కరుణాకర్ తో కలిసి మంగళవారం నిందితి ని అరెస్ట్ చూపిస్తూ వివరాలు వెల్లడించారు. నిందితుడు కాపుగేరి రాజు మహబూబ్ నగర్ జిల్లా అదే పట్టణం హనుమాన్ పురకు చెందిన వాడని పేర్కొన్నారు.ఈయన తన సహచరులతో కలిసి భద్రాచలం ప్రాంతం నుండి సుమారు 2.400(2 కేజీ ల 400 గ్రాములు) కిలోలు గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాదులో అధిక ధరలకు విక్రయించాలని అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడు.ఈ క్రమంలో నిందితుడు నాటి నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు.పోలీసులు మంగళవారం నిందితుడు రాజును మహబూబ్ నగర్ జిల్లా పట్టణ కేంద్రంలో ని ఆయన( నిందితుని) ఇంటిలో పోలీసులు పట్టుకొని ఆయన నుంచి ఆపిల్ కంపెనీకి చెందిన మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో విచారణ కొనసాగుతున్నట్లు సీఐ సత్యనారాయణ వెల్లడించారు.

ఆరోగ్య సమాజానికి సహకరించాలి: సిఐ

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు సహకరించాలని సిఐ సత్యనారాయణ పిలుపునిచ్చారు.మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గంజాయి అక్రమ రవాణా,మత్తు పదార్థాల వినియోగం, విక్రయాల నియంత్రణలో భాగంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.గంజాయి,ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలుపాలన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి అభివృద్ధితో కూడిన ఆరోగ్య సమాజానికి ఊతమందించాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.