📄 ePaper
Epaper 2
Thursday, November 5, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణప్రజలు సమస్యలపై ఆందోళన పోరాటాలు

ప్రజలు సమస్యలపై ఆందోళన పోరాటాలు

📰 Generate e-Paper Clip

ప్రజలు సమస్యలపై ఆందోళన పోరాటాలు

: సిపిఎం నేత అల్వాల వీరయ్య పిలుపు

డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి నవంబర్ 3 ప్రజావాణి:
కురవి మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళన పోరాటాలు నిర్వహించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అల్వాల వీరయ్య పిలుపునిచ్చారు. మంగళవారం రోజున సిపిఎం కురవి మండల కమిటీ సమావేశం నల్లపు సుధాకర్ అధ్యక్షతన జరిగింది.

సమావేశంలో వీరయ్య మాట్లాడుతూ, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, పత్తి కింటాకు రూ.12,000 ఇవ్వాలని, 24 గంటల నాణ్యమైన విద్యుత్తు అందించాలని, అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, వితంతు, వికలాంగుల, ఒంటరి మహిళల గీతా నేత పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

గ్రామాల్లో అంతర్గత రహదారులు, సైడ్ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని, కనీస సౌకర్యాలు కల్పించాలని, అంబేద్కర్ అభయ హస్తం కింద దళిత గిరిజన యువకులకు రూ.12 లక్షలు ఇవ్వాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేసి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన పేదలందరికీ రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, మొదటి విడతలో మంజూరైన ఇళ్లకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, కరువు నివారణ చర్యలు వెంటనే చేపట్టాలని, రైతులకు ఎకరానికి రూ.50 వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి పిట్టల వెంకన్న, మండల నాయకులు నల్లపు సుధాకర్, గంధసిరి శ్రీనివాస్, కడియం సత్యం, కట్ల కృష్ణయ్య, పోతిగంటి మల్లయ్య, జక్కుల మల్లయ్య, తగరం తిరుపతి, నాలం వెంకన్న, మాలోత్ కిషన్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.