*మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ లక్ష్మీ చేతుల మీదుగా దేవాలయ ప్రారంభోత్సవ బ్రోచర్ల విడుదల*
*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*
సోమవారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మీ చేతుల మీదుగా దేవాలయ ప్రారంభోత్సవానికి సంబంధించిన బ్రోచర్ల ను, ఆహ్వాన పత్రికలను ఘనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఆలయాల నిర్మాణం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను, సాంస్కృతిక విలువలను పెంపొందిస్తాయని అన్నారు. భక్తులందరూ పెద్ద ఎత్తున హాజరై ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఫౌండేషన్ ప్రతినిధులు, స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

