📄 ePaper
Epaper 2
Tuesday, November 3, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగూడూరులో జరిగిన ధర్నాతో లంబాడి హక్కుల పోరాట సమితికి ఎలాంటి సంబంధం లేదు

గూడూరులో జరిగిన ధర్నాతో లంబాడి హక్కుల పోరాట సమితికి ఎలాంటి సంబంధం లేదు

📰 Generate e-Paper Clip

*గూడూరులో జరిగిన ధర్నాతో లంబాడి హక్కుల పోరాట సమితికి ఎలాంటి సంబంధం లేదు!*

*లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తేజావత్ వాసు నాయక్*

గూడూరు మండల ప్రతినిధి:- నవంబర్ 03. (మన సమగ్ర ప్రజావాణి):-
మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండలంలో భానోత్ రామన్న నాయక్‌పై జరిగిన దాడి ఘటనకు నిరసనగా, లంబాడి హక్కుల పోరాట సమితి పేరుతో నిర్వహించిన ధర్నాకు మా సంఘానికి ఎలాంటి సంబంధం లేదని, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తేజావత్ వాసు నాయక్ అన్నారు. గూడూరులో చోటుచేసుకున్న పరిణామాలపై పూర్తి వాస్తవాలను తెలుసుకుంటున్నామని ఆయన అన్నారు. ఈ ఘటనలో ఎవరు నష్టపోయారు? ఎవరు ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అనే అంశాలను ఆధారాలతో సహా పరిశీలించిన అనంతరం సంఘం తరఫున తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని, అసంపూర్ణ సమాచారంతో ఎలాంటి నిర్ణయాలకు రావద్దని కోరుతున్నామని, వాస్తవాలను ప్రజల ముందుంచేందుకు త్వరలోనే తేదీని ప్రకటించి, అధికారికంగా మా వైఖరిని వెల్లడిస్తామని, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తేజావత్ వాసు నాయక్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.