*లక్ష్మీదేవిపల్లిలో ట్రాక్టర్ ట్రాలీ బోల్తా*
*తృప్తిలో తప్పిన ప్రమాదం..*
లక్ష్మీదేవిపల్లి, నవంబర్ 02 (మన ప్రజావాణి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, లక్ష్మీదేవిపల్లి మండలం పరిధిలోని బావార్చి హోటల్ సమీపంలో ప్రమాదవశాత్తూ ఒక ట్రాక్టర్ ట్రాలీ బోల్తాపడిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ నియంత్రణ కోల్పోయి రహదారిపై బోల్తా పడింది. అయితే ఈ ఘోర ప్రమాదంలో డ్రైవర్ తోపాటు ప్రయాణిస్తున్న ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ సురక్షితంగా బయటపడటంతో పెద్ద ప్రమాదం తృప్తిలో తప్పినట్లయింది.

