ముదిగొండలో రైతు మహిళ కొమ్మూరి స్వాతికి ఘన సన్మానం
ముదిగొండ అక్టోబర్ 31 ప్రజావాణి
ముదిగొండ మండలానికి చెందిన మహిళా రైతు కొమ్మూరి స్వాతి ఇటీవల ప్రతిష్టాత్మక “రైతు మహిళా అవార్డు” అందుకున్న సందర్భంగా, గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆమెను ఘనంగా సన్మానించారు. ముదిగొండ గ్రామ సర్పంచ్ కట్టకూరు ఉపేందర్ మరియు పాలకమండలి సభ్యులు ఈ అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.గ్రామానికి రైతు మహిళగా మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చి, మండల స్థాయిలోనే ముదిగొండ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసినందుకు పాలకమండలి తరఫున స్వాతి దంపతులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కట్టకూరు ఉపేందర్ స్వయంగా స్వాతి దంపతులను శాలువాతో సన్మానించి, నోటి తీపిని పంచుతూ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చెరుకూరి పార్వతి, వార్డు సభ్యులు తునికి పాటు రూప, షేక్ దస్తగిరి, మెట్టెల సతీష్, తోటకూర వెంకటేశ్వర్లు, శ్రీకాంత్, నాగమణి అలాగే ప్రముఖ రైతు కమర్థ్యపు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

