ముదిగొండలో రైతు మహిళ కొమ్మూరి స్వాతికి ఘన సన్మానం
ముదిగొండలో రైతు మహిళ కొమ్మూరి స్వాతికి ఘన సన్మానం ముదిగొండ అక్టోబర్ 31 ప్రజావాణి ముదిగొండ మండలానికి చెందిన మహిళా రైతు కొమ్మూరి స్వాతి ఇటీవల ప్రతిష్టాత్మక "రైతు మహిళా అవార్డు" అందుకున్న సందర్భంగా, గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆమెను ఘనంగా సన్మానించారు. ముదిగొండ గ్రామ సర్పంచ్ కట్టకూరు ఉపేందర్ మరియు పాలకమండలి సభ్యులు ఈ అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.గ్రామానికి రైతు మహిళగా మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చి, మండల స్థాయిలోనే ముదిగొండ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసినందుకు పాలకమండలి తరఫున స్వాతి దంపతులకు...