📄 ePaper
Epaper 2
Sunday, November 1, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణనరసింహులపేట మండల కేంద్రంలో కుక్కల స్వైర విహారం

నరసింహులపేట మండల కేంద్రంలో కుక్కల స్వైర విహారం

📰 Generate e-Paper Clip

నరసింహులపేట మండల కేంద్రంలో కుక్కల స్వైర విహారం

వీధి కుక్కల బెడదతో ప్రజల ఆందోళన.. చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

ప్రజావాణి రిపోర్టర్ నరసింహులపేట: అక్టోబర్ 31. మండలంలోని ఈరోజు ఉదయం శివాలయం దగ్గర ఐదుగురిని పిచ్చికుక్క కరవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు పట్టింపు లేని గ్రామపంచాయతీ పాలకవర్గం పలు గ్రామాలు, ప్రధాన వీధుల్లో వీధి కుక్కల సంచారం ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. చికెన్ సెంటర్ దగ్గర కుక్కలు గుంపులుగా తిరుగుతూ బజారు వెళ్తే చాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ద్విచక్ర వాహనం రహదారులపై నడిచేందుకు భయపడుతున్నారని ప్రజలు చెబుతున్నారు.
వీధి కుక్కల సమస్య రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రాత్రి వేళల్లో రహదారులపై గుంపులు గుంపులుగా. కుక్కలు సంచరించడంతో ద్విచక్ర వాహనదారులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటున్నారు. కుక్కలు వెంటపడటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజారోగ్యంపై ప్రజలు. ఆందోళన
వీధి కుక్కల బెడదను నిర్లక్ష్యం చేస్తే ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. కుక్కల దాడులు, కాట్ల నుంచి ప్రజలను రక్షించేందుకు ముందస్తు చర్యలు అవసరమని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే పిల్లల విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరుతున్నారు.
గ్రాల్మస్తులు.అధికారుల స్పందన కోసం ఎదురుచూపులు
స్థానిక మండలంలో వీధి కుక్కల సమస్యను పరిష్కరించేందుకు సంబంధిత గ్రామపంచాయతీ అధికారులు తక్షణమే స్పందించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. కుక్కల నియంత్రణకు నిబంధనలకు అనుగుణంగా చర్యలు చేపట్టడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు.ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యం: వీధి కుక్కల సమస్యపై అధికారులు నిర్లక్ష్యం చేయకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.