📄 ePaper
Epaper 2
Saturday, October 31, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకూటమితోనే ఒంగోలు నగరానికి అభివృద్ధికి కృషి

కూటమితోనే ఒంగోలు నగరానికి అభివృద్ధికి కృషి

📰 Generate e-Paper Clip

కూటమితోనే ఒంగోలు నగరానికి అభివృద్ధికి కృషి

ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్

ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో అక్టోబర్ 28

52వ డివిజన్‌లో టీడీపీ మేయర్ అభ్యర్థి నల్లమల్లి శ్రీ శిల్ప విస్తృత ఎన్నికల ప్రచారం

ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని 52వ డివిజన్‌లో కూటమి బలపరిచిన ఒంగోలు టీడీపీ మేయర్ అభ్యర్థి శ్రీమతి నల్లమల్లి శ్రీ శిల్ప శుక్రవారం ఉదయం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

52వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీమతి కండే స్వాతితో కలిసి గణపతి నగర్, శ్రామిక నగర్, విరాట్ నగర్ ప్రాంతాల్లో పర్యటించిన శ్రీమతి నల్లమల్లి శ్రీ శిల్ప స్థానిక ప్రజలను, ఓటర్లను నేరుగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఒంగోలు నగర అభివృద్ధికి భవిష్యత్తులో చేపట్టనున్న చర్యలను వివరించారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ముఖ్యంగా గణపతి నగర్‌లో తాగునీటి సమస్యను పరిష్కరించే దిశగా సంతనూతలపాడు ఎమ్మెల్యే శ్రీ బి.ఎన్. విజయ్ కుమార్ గారి సహకారంతో ప్రతి ఇంటికీ మంచినీటి కుళాయి ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా మేయర్ అభ్యర్థిగా తనకు, 52వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా శ్రీమతి కండే స్వాతికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని శ్రీమతి నల్లమల్లి శ్రీ శిల్ప ఓటరు మహాశయులను అభ్యర్థించారు.

ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో నాయకులు కండే రమణ యాదవ్, పాశం తిరుపతయ్య, మంచా బాబు, వీరబ్రహ్మం, రాచకొండ తిరుపతయ్య, కండే వెంకటేశ్వర్లు, పూర్ణ తదితరులు పాల్గొన్నారు…

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.