📄 ePaper
Epaper 2
Saturday, October 31, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఅతివేగం తో కరెంట్‌ పోల్‌ ను ఢీకొని బోల్తాపడిన వాహనం

అతివేగం తో కరెంట్‌ పోల్‌ ను ఢీకొని బోల్తాపడిన వాహనం

📰 Generate e-Paper Clip

*అతివేగం తో కరెంట్‌ పోల్‌ ను ఢీకొని బోల్తాపడిన వాహనం*

*ఎనిమిది పశువుల అక్రమ తరలింపు.. డ్రైవర్‌ కు గాయాలు*

*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*

ఆంధ్రప్రదేశ్‌ నుంచి హైదరాబాద్‌ కు చిన్న వాహనం లో ఎనిమిది పశువులను అక్రమంగా తరలిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. చండూరు మండలం ఉడుతలపల్లి గ్రామ శివారులో శనివారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ లోని అనకాపల్లి నుంచి హైదరాబాద్‌ కు ఏపీ 39 వీబీ 1823 నంబరు గల అశోక్‌ లేలాండ్‌ వాహనంలో నాలుగు ఆవులు, నాలుగు ఎడ్లను ఒకదానిపై మరొకటి కుక్కి తరలిస్తున్నారు. ఈ క్రమంలో అతివేగం కారణంగా వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని బలంగా ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ పల్లా సూరిబాబుకు రక్తగాయాలయ్యాయి. ఈ ఘటనపై బీట్‌ కానిస్టేబుల్‌ కోమరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు చండూరు ఎస్‌.ఐ. ఒక ప్రకటనలో తెలిపారు. పట్టుబడిన పశువుల సంరక్షణ నిమిత్తం బంగారిగడ్డలోని యుగ తులసి గోశాలకు తరలించినట్లు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.