📄 ePaper
Epaper 2
Saturday, October 31, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణప్రతి పౌరుడికి సమాన హోదా కల్పించడమే రాజ్యాంగ లక్ష్యం.

ప్రతి పౌరుడికి సమాన హోదా కల్పించడమే రాజ్యాంగ లక్ష్యం.

📰 Generate e-Paper Clip

ప్రతి పౌరుడికి సమాన హోదా కల్పించడమే రాజ్యాంగ లక్ష్యం….!

చిన్నమండవలో ఘనంగా పౌర హక్కుల దినోత్సవం

పౌరుల హక్కులు బాధ్యతలపై అవగాహన కల్పించిన తహసీల్దార్ కరుణశ్రీ ఎస్సై జి నరేష్..!

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా చింతకాని మండలం చిన్నమండవ గ్రామ పంచాయతీ కార్యాలయంలో పౌర హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల తహసీల్దార్ కరుణశ్రీ ఎస్సై జి నరేష్ హాజరై ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు వాటి ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్థానిక తహసిల్దార్ కరుణ శ్రీ ఎస్సై జి నరేష్ లు మాట్లాడుతూ భారత రాజ్యాంగమే దేశంలోని ప్రతి పౌరుడికి సమానత్వం స్వేచ్ఛ న్యాయం గౌరవప్రదమైన జీవనానికి పునాది అని పేర్కొన్నారు. రాజ్యాంగ పరిషత్ 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని ఆమోదించగా 1950 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చిందని గుర్తుచేశారు. ఇందులో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు ప్రతి ఒక్కరికీ సమానత్వపు హక్కు స్వేచ్ఛా హక్కు మత స్వాతంత్ర్యం దోపిడీకి వ్యతిరేకంగా రక్షణ సాంస్కృతిక మరియు విద్యా హక్కులతో పాటు రాజ్యాంగ పరిష్కారాలను పొందే అవకాశాన్ని కల్పించాయని వివరించారు. కులమత ప్రాంత భేదాలకు అతీతంగా చట్టం ముందు అందరూ సమానులేనని ఎలాంటి వివక్షకు తావులేదని స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛను సద్వినియోగం చేసుకుంటూనే పౌరులుగా ప్రతి ఒక్కరూ తమ సామాజిక బాధ్యతలను నెరవేర్చాలని సూచించారు. ముఖ్యంగా మహిళలు బలహీన వర్గాలపై జరిగే అన్యాయాలు వివక్షను మౌనంగా భరించకుండా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఎక్కడైనా హక్కుల ఉల్లంఘన జరిగితే చట్టపరమైన మార్గాల ద్వారా న్యాయం పొందే అవకాశం ఉందని బాధితులు భయపడకుండా ముందుకు రావాలని తెలిపారు. వ్యక్తిగత స్వేచ్ఛతో పాటు ఇతరుల హక్కులను గౌరవిస్తూ రాజ్యాంగ విలువలను ఆచరణలో పాటించినప్పుడే సమానత్వం న్యాయం సౌభ్రాతృత్వంతో కూడిన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పర్చ రామచంద్రరావు ఆర్ ఐ ఏకవీర వివిధ పార్టీల నాయకులు అధికారులు యువకులు గ్రామ కార్యదర్శులు జీపీఓలు గ్రామపంచాయతీ సిబ్బంది ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.