ఎదురెదురు బైకులు ఢీ.. ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు
అన్నసాగర్–చింతకుంట మధ్య రోడ్డు ప్రమాదం
జోగిపేట, అక్టోబర్ 31 (మన ప్రజావాణి ప్రతినిధి): ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అన్నసాగర్ నుంచి చింతకుంటకు వెళ్లే మార్గమధ్యలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. పాపన్నపేట మండలానికి చెందిన మాసయ్య (తండ్రి మానయ్య), రాజ్‌కుమార్ (తండ్రి హుషాయ్య), సంగమేశ్వర్ (తండ్రి దశరథ్) కూలి పనులు చేసుకుని వెళ్తున్న క్రమంలో ఎదురుగా వచ్చిన మరో బైక్‌ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో మాసయ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే క్షతగాత్రులను అంబులెన్స్‌లో జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న జోగిపేట సీఐ అనిల్ కుమార్ ప్రమాదానికి సంబంధించిన వివరాలను పరిశీలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

