*మద్యానికి బానిసై పురుగులు మందు తాగి వ్యక్తి మృతి*
ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 31
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం రంగువారిగూడెం గ్రామానికి చెందిన చింతల హరీష్, తండ్రి: ప్రకాష్ రావు (32సం,,లు) అను అతను గత కొన్ని రోజులుగా మద్యం కు బానిసై ఏ పని చేయకుండా కుటుంబ పోషణ పట్టించుకోకుండా ఉన్నాడని.భార్య మందలించడంతో కోపంతో అశ్వరావుపేట మండలం నారంవారిగూడెం గ్రామంలోని మృతుని అక్క ఇంటికి వచ్చి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గుర్తుతెలియని పురుగుమందు తాగి పడి ఉండగా. సాయంత్రం పని నుండి ఇంటికి వచ్చిన మృతుని అక్క మృత వైద్య నిమిత్తం అశ్వరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా. వైద్యులు పరీక్షించి అప్పటికే చింతల హరీష్ మృతి చెందినట్లు తెలియజేశారు.మృతుని భార్య అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు ఇవ్వగా ఎస్సై బి కిషోర్ రెడ్డి.కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని అన్నారు. మృతునికి ఇద్దరు కుమారులు సంతానం. ఉన్నట్లు తెలియజేశారు,

