📄 ePaper
Epaper 2
Saturday, October 31, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణనర్మెట మండలంలో ఇందిరమ్మకు ఘన నివాళులు.

నర్మెట మండలంలో ఇందిరమ్మకు ఘన నివాళులు.

📰 Generate e-Paper Clip

నర్మెట మండలంలో ఇందిరమ్మకు ఘన నివాళులు..

ధీర వనిత సేవలు చిరస్మరణీయం నర్మెట గ్రామ సర్పంచ్ గోపగోని శ్రీధర్ గౌడ్

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 31(ప్రజావాణి): జనగామ నియోజకవర్గం నర్మెట మండల కేంద్రంలో భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న, ఉక్కు మహిళ ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా నర్మెట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నివాళులర్పించారు. ముందుగా ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి, పుష్పాంజలి ఘటించి, రెండు నిమిషాలు మౌనం పాటించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

ఈ సందర్భంగా నర్మెట గ్రామ సర్పంచ్ గోపగోని శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ..
“భారతదేశ కీర్తి పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగురవేసిన ధీర వనిత ఇందిరమ్మ. దేశ సమగ్రత, ఐక్యత కోసం తన ప్రాణాలనే అర్పించిన అమరజీవి ఆమె. 1971లో పాకిస్తాన్ తో యుద్ధంలో బంగ్లాదేశ్ ను ప్రత్యేక దేశంగా నిలబెట్టి, భారత్ ను అగ్రరాజ్యంగా నిలిపిన ఘనత ఇందిరమ్మదే. ఆమె తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు, చూపిన అచంచలమైన ధైర్యం నేటికీ దేశానికి దిక్సూచి. బ్యాంకుల జాతీయీకరణ, పేదలకు పట్టాలు, హరిత విప్లవం లాంటి ఎన్నో సంస్కరణలతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లారు. సమర్థవంతమైన నాయకత్వానికి, అంకితభావానికి నిలువెత్తు రూపం ఇందిరా గాంధీ” అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి బాలచందర్ గౌడ్, చేర్యాల మార్కెట్ కమిటీ డైరెక్టర్ కన్నబోయిన రామకృష్ణ యాదవ్,
జిల్లా నాయకులు భూక్యా జయరాం నాయక్, వాలబోజు శ్రీనివాస్, రాజబోయిన లక్ష్మీ నారాయణ, బానోత్ బాలుసింగ్ నాయక్, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు చేవుల పరశురాములు యాదవ్, అమ్మాపురం సర్పంచ్ రేఖా బాపురాజు గౌడ్, వంగా భూపాల్ రెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు కొంపెల్లి అంబేద్కర్, మండల నాయకులు జడల రమేష్ గౌడ్, ఉపా సర్పంచ్ ఇనుగాల రాజిరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు ప్రజ్ఞాపూరం శ్రీధర్, బొలగంరాజు గౌడ్, చేవులరాజు, కాల్వ అశోక్, బానోత్ మహేందర్ నాయక్, కూకట్లా ఉపేందర్, ఇట్టాబోయిన శ్రీనివాస్, మహేష్ తదితర కాంగ్రెస్ శ్రేణులు, యూత్ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.