కళ్లేపల్లిలో గడ్డం కుటుంబానికి రూ.30 వేల ఆర్థిక సాయం
బెజ్జంకి, అక్టోబర్ 31 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కళ్లేపల్లి గ్రామానికి చెందిన గడ్డం సాత్విక్ ఆకస్మిక మరణంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. పెద్ద కుమారుడైన సాత్విక్ మరణాన్ని తట్టుకోలేక, పది రోజుల వ్యవధిలోనే ఆయన తండ్రి గడ్డం మధు గుండెపోటుతో మృతి చెందడం కుటుంబాన్ని మరింత శోకసంద్రంలో ముంచింది.ఈ కష్ట సమయంలో మానవత్వంతో స్పందించిన గడ్డం మధు సోదరుడు గడ్డం మహేష్‌కు చెందిన 2009-2010 పదో తరగతి బ్యాచ్ స్నేహితులు బాధిత కుటుంబానికి అండగా నిలిచారు.స్నేహితులందరూ కలిసి రూ.30,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

