ఎన్నికల భద్రతకు 800 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు.
మార్కాపురం జిల్లా ఎస్పీ ఫంకాజ్ కుమార్ మీనా (ఐపిఎస్ )
ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 30 మార్కాపూర్ జిల్లా.
మార్కాపురం జిల్లాలో స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు.జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా (ఐపీఎస్).
మున్సిపల్ ఎన్నికల బందోబస్తు కోసం సుమారు 800 మంది పోలీసు సిబ్బంది నియామకం.
ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్, చెక్‌పోస్టుల ద్వారా నిరంతర నిఘా.
పోలింగ్ కేంద్రాలు, రిసెప్షన్ సెంటర్లు, స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు
మార్కాపురం, గిద్దలూరు, కనిగిరిలోని స్ట్రాంగ్ రూములను పరిశీలించి భద్రతా ఏర్పాట్లు.
స్ట్రాంగ్ రూముల వద్ద రెండు అంచెల భద్రత. మొదటి అంచెలో ఆర్మ్డ్ గార్డులు, రెండో అంచెలో సివిల్ పోలీసుల పహారా.
ఎన్నికల అనంతరం బ్యాలెట్ బాక్సుల తరలింపు సమయంలో ప్రత్యేక రూట్ బందోబస్తు.
కౌంటింగ్ రోజు కూడా ఇదే తరహాలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు.
సెక్షన్ 144 అమలులో ఉన్నందున ఓటర్లు తమ ఓటు ఉన్న ప్రాంతంలోనే ఉండాలి.
అనవసరంగా గుంపులుగా చేరడం, ఇతర ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లడం చేయరాదు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలి.
ఎన్నికలకు సంబంధించి సమస్యలు, ఫిర్యాదులు ఉంటే ఎస్హెచ్ఓ, సీఐ, డీఎస్పీ లేదా జిల్లా ఎస్పీకి ఫోన్, మెసేజ్ లేదా లిఖితపూర్వకంగా తెలియజేయవచ్చు.
ఎన్నికలు ప్రశాంతంగా పారదర్శకంగా జరిగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి.

