*డిఎంహెచ్ఓ సహా పలువురు వైద్యాధి కారులకు జిల్లా కలెక్టర్ షోకాజు నోటీసులు…*
*టి-హబ్ వైద్య నివేదికల నిర్లక్ష్యంపై సీరియస్.*
*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 30*
టి-హబ్ వైద్య నివేదికల జాప్యంపై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి (డిఎంహెచ్ఓ) జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారితో సహా పలువురు అధికారు లకు జిల్లా కలెక్టర్ శుక్రవారం రోజున షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
జిల్లాలోని టి-హబ్ కార్యక్రమం కింద నిర్వ హించే ఉచిత వైద్య పరీ క్షల శాంపిళ్ల సేకరణ , అలాగే వాటి రిపోర్టులను సకాలంలో అందించడం లో నిర్లక్ష్యం వహించి నందుకు గాను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎం .మనోహర్ , ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మణ్ రావు , ప్రోగ్రాం ఆఫీసర్ వి.వంశీ కృష్ణ లకు షో-కాజ్ నోటీసులు జారీ చేసినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి నెడోక ప్రకటనలో తెలిపారు.

