*పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రం పరిశీలన…*
*పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి.*
*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 30*
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రం లో వరంగల్-ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు నమోదు కోసం ఏర్పాటు చేసిన ఓటరు నమోదు కేంద్రాన్ని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి శుక్రవారం రోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటరు నమోదు కేంద్రంలో జరుగు తున్న ప్రక్రియను , ఆన్లైన్ ద్వారా పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసు కునే విధానాన్ని , ఇప్పటి వరకు జరిగిన నమోదు ప్రక్రియ పురోగతిని సంబంధిత నాయకులను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన పట్టభద్రు లందరూ తమ ఓటు హక్కును పొందేందుకు నిర్ణీత విధానంలో ఆన్లైన్ ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించాలని స్థానిక ప్రజాప్రతినిధులు , నాయకులకు ఎమ్మేల్యే సూచించారు. ఈ కార్య క్రమంలో వలిగొండ పట్టణ, మండల ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

