📄 ePaper
Epaper 2
Saturday, October 31, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణచిలాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత షూల పంపిణీ చేసిన ...

చిలాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత షూల పంపిణీ చేసిన సర్పంచ్ శానగొండ స్వరూప-భాస్కరాచారి

📰 Generate e-Paper Clip

చిలాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత షూల పంపిణీ చేసిన

సర్పంచ్ శానగొండ స్వరూప-భాస్కరాచారి

బెజ్జంకి, అక్టోబర్ 30 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని చిలాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం అందించిన ఉచిత షూల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ శానగొండ స్వరూప భాస్కరాచారి ప్రారంభించారు.పాఠశాలలో మొత్తం 83 మంది విద్యార్థులు ఉండగా, ప్రభుత్వం కేటాయించిన 67 జతల షూలను విద్యార్థులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్యం, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఉచితంగా షూలు అందించడం అభినందనీయమని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా వారి విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాదారం హరీష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిరుమలేష్,ఉపాధ్యాయులు రామంచ రవి, వీరబత్తిని కవిత, పైడి కవిత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.