ప్రజాస్వామ్య పరిరక్షణకు రామ్ లీలా మార్చ్ లో పాల్గొనాలి..
కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు రామ్ గోండ…
మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 30
ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓట్ల చోరిని అడ్డుకోవడం రాజ్యాంగ విలువలను కాపాడటమే లక్ష్యంగా ఢిల్లీలో నిర్వహించనున్న రామ్ లీలా మార్చ్ లో పార్టీలకు అతీతంగా ప్రతినిధిని కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు రామ్ గొండా పిలుపునిచ్చారు.. ఈ మార్చ్ ఏ ఒక్క రాజకీయ పార్టీకి పరిమితమైన కార్యక్రమం కాదని, భారతదేశ ప్రజాస్వామ్య విలువలను పరి రక్షించేందుకు చేపడుతున్న నిరసన కార్యక్రమాన్ని పేర్కొన్నారు.. రాజ్యాంగంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వాములు కావాలని కోరారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు రామ్ గొండ విజ్ఞప్తి చేశారు.. ప్రజాస్వామ్య పరిరక్షణ రాజ్యాంగ విలువల కాపాడటమే మార్చ్ ప్రధాన ఉద్దేశమని సృష్టం చేశారు..

