పశువైద్య ఆరోగ్య శిబిరం మరియు పశు సంతానోత్పత్తి శిబిరం నిర్వహించారు
*ప్రజా వాణి న్యూస్ అక్టోబర్ 30 సంగారెడ్డి జిల్లా*
సంగారెడ్డి జిల్లా అందోల్ నియరాయికోడ్ మండలం, హస్నాబాద్ గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువైద్య ఆరోగ్య శిబిరం మరియు పశు సంతానోత్పత్తి శిబిరం నిర్వహించడం జరిగింది.
ఈ శిబిరంలో భాగంగా వివిధ పశువైద్య సేవలు అందించడంతో పాటు, పశువుల ఆరోగ్య పరిరక్షణ మరియు పునరుత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి అవసరమైన సేవలు అందించబడ్డాయి.
శిబిరంలో నిర్వహించిన కార్యక్రమాల వివరాలు:
1. సాధారణ పశువైద్య కేసులకు చికిత్స – 34
2. గర్భధారణ నిర్ధారణ పరీక్షలు (PD Check-up) – 7
3. కృత్రిమ గర్భధారణ (Artificial Insemination – AI) – 2
4. గొర్రెలు మరియు మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ (Deworming) – 510
5. పశువులకు లంపీ స్కిన్ డిసీజ్ (LSD) వ్యాధి నివారణ టీకాలు – 84
ఈ కార్యక్రమం ద్వారా రైతులకు పశువైద్య సేవలు అందించి, పశువుల ఆరోగ్య పరిరక్షణ, వ్యాధుల నివారణ మరియు పశుసంపద అభివృద్ధికి కృషి చేయడం జరిగింది. కార్యక్రమంలో డా. పి. హర్షవర్ధన్ రెడ్డి – పశువైద్య సహాయశస్త్రచికిత్సాధికారి (VAS)
శ్రీ సుకేష్ పాల్ – LSA
శ్రీ శివకుమార్ – గోపాలమిత్ర
శ్రీ మల్లేశం – గోపాలమిత్ర
హస్నాబాద్ గ్రామం
పశుసంపద ఆరోగ్య పరిరక్షణ మరియు రైతులకు మెరుగైన పశువైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ శిబిరం నిర్వహించబడింది.
